Indian 2: జూన్‌లో వచ్చేస్తున్నా .. ‘భారతీయుడు 2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినీ రంగంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్‌గా భారీ చిత్రాలను అద్భుతం అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించటంలో సుప్రసిద్ధుడు. ఆయన సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్దరూ చేతులు కలిపారంటే అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందనటంలో సందేహం లేదు. భారతీయుడు (ఇండియన్) సినిమాతో అది నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘భారతీయుడు 2’తో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేయబోతున్నారు. భారతీయుడు బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ తిరుగులేని విజయాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుండటంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. గ్రిప్పింగ్ కథనంతో ఈ మూవీ మరింతగా ప్రేక్షకులను మెప్పించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘భారతీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే ప్రమోషనల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసిన శంకర్ ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేయటంపై దృష్టి సారించారు. మే నెలాఖరున పవర్‌ప్యాక్డ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.‘భారతీయుడు 2’ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి, మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘జీరో టాలరెన్స్’ లైన్ ఈ అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ కలయిక ప్రేక్షకులకు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందనటంలో సందేహం లేదు.లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో ‘భారతీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేలా సినిమాలు చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జూన్‌లో ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!