The Hundred 2026: పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించిన ఆ 4 మేజర్ టీమ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Hundred 2026: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. అదేమిటంటే.. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఆ నాలుగు మేజర్ జట్లు అస్సలు ఇష్టపడటం లేదట. దీనికి గల కారణాలు, అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్‌కు ఇది కీలక పరీక్ష!
Also Read
వివాదం ఏమిటంటే..
ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉంటాయి. అందులో నాలుగు జట్ల (మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, MI లండన్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్) యజమానులు భారతీయులే. అంటే మన ఐపీఎల్ (IPL) జట్ల యజమానులే ఈ జట్లను కూడా కొనుగోలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఈ భారతీయ యజమానులు తమ జట్లలోకి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి సంబంధించి 2026 మార్చి 11న మహిళా ఆటగాళ్లకు, మార్చి 12న పురుష ఆటగాళ్లకు లండన్‌లో వేలం జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి దాదాపు 18 దేశాల నుంచి 1,000 మంది ప్లేయర్స్ లిస్టులో ఉండగా.. అందులో 50 మందికి పైగా పాకిస్థాన్ ఆటగాళ్లు ఉన్నారు.
నిజానికి ఆటగాళ్ల జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, జట్లను కొనుగోలు చేసే విషయంలో యజమానులకు స్వయంప్రతిపత్తి ఉంటుంది. అందుకే వారు తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పాక్ ప్లేయర్లకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్లలో షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజం, హారిస్ రౌఫ్ వంటి స్టార్ ప్లేయర్స్ ఈ లీగ్‌లో ఆడారు. కానీ ఇప్పుడు లీగ్‌లో భారతీయ యజమానులు పెరగడంతో, వారికి అవకాశాలు తగ్గిపోనున్నాయని ప్రచారం జరుగుతుంది. కేవలం ఐపీఎల్ లోనే కాకుండా, సౌతాఫ్రికా (SA20), యూఏఈ (ILT20) లీగ్‌లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. సింపుల్‌గా చెప్పాలంటే.. భారతీయులు ఓనర్స్‌గా ఉన్న జట్లు పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో, వారు ఈ మెగా లీగ్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా, క్రీడాపరంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Rashmika Mandanna: కాక్టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!