మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఓ పక్కన షూటింగ్ జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి..
ఈ సినిమాలో చిరంజీవికి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై చిరంజీవి ఆశలు పెట్టుకున్నారు.. గతంలో వచ్చిన ఆచార్య, భోళాశంకర్ సినిమాలు అనుకున్న హిట్ ను సొంతం చేసుకోలేదు.. ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.. ఈరోజు కీరవాణి త్రిష ఇద్దరు చిరంజీవి ఇంట్లో కలిశారు. అనంతర రామ్ చరణ్ కుక్కపిల్లతో కాసేపు త్రిష ఆడుకుంది.. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. కంపోజ్ చేసిన పాటలను విన్నారు.. ఆ సమయంలో త్రిష తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటో వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ సినిమా నుంచి సాంగ్ రాబోతుందని సమాచారం..అనంతర రామ్ చరణ్ కుక్కపిల్లతో కాసేపు త్రిష ఆడుకుంది.. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక విశ్వంభర సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది.