Sujitha: సుజిత.. ఈ పేరు వినగానే పసివాడి ప్రాణం సినిమా గుర్తొస్తుంది. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో పసివాడిగా లాలా.. లాలా అంటూ చిరంజీవిని పిలిచే చిన్నారి ఎవరో కాదు.. మన సుజితనే. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక బాలనటిగా పలు సినిమాలు చేసిన ఆమె.. హీరోయిన్ గా మారలేకపోయింది. హీరోలకు చెల్లిగా, వదినగా కీలక పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె.. బుల్లితెరపై అడుగుపెట్టింది. బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకునే ప్రభాకర్ సరసన వదినమ్మ అనే సీరియల్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం ఒకపక్క సీరియల్స్, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న సుజిత పర్సనల్ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు. అవును.. ఆమె నిర్మాత సూర్యకిరణ్ చెల్లెలు. స్టార్ హీరోయిన్ కళ్యాణి ఆడపడుచు. ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పెదబాబు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కళ్యాణి.. సూర్య కిరణ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని ఆర్థిక విబేధాల వలన వారు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ విడాకుల గురించి సుజిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Shobu Yarlagadda: ఆటిట్యూడ్ తో హిట్ సినిమా వదులుకున్న ఆ హీరో ఎవరు.. ?
” నేను, వదిన చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. అక్కచెల్లెళ్లు లా మెలిగేవాళ్ళం. ఆమెతో ఉండాలంటే నాకెంతో ఇష్టం. మా అన్నయ్యను పెళ్లి చేసుకొనే సమయానికే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్. వారి పెళ్లి అయిన మూడేళ్లకు నాకు వివాహం జరిగింది. ఇక పెళ్లి తరువాత వారిని ఎక్కువ కలవలేకపోయాను. ఎప్పుడైనా షూటింగ్ కు హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసేదాన్ని. అయితే వారి జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు.. దంపతుల్లో ఒక్కరైనా వాటిని హ్యాండిల్ చేసేలా ఉండాలి. లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇక మా అన్నావదినలు చేసిన అతి పెద్ద తప్పు.. నిర్మాతలుగా మారడం. మొదటి సినిమాకు నిర్మాతగా మారినప్పుడు అన్నయ్య నాకు చెప్పాడు. నేను సంతోషించాను. ఆ తరువాత సినిమా రిలీజ్ అవ్వడం.. అది పెద్ద ప్లాప్ కావడంతో నిండా మునిగిపోయారు. ఆస్తిపాస్తులు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేరళలో ఒక ల్యాండ్ ఉండేది. దాన్ని కూడా అమ్మేశారు. ఇక ఆ విషయం మాకు తెలిసి సహాయం చేద్దామనుకొనేలోపు మొత్తం చెయ్యిదాటిపోయింది..” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.