Drinking Water: ఆ మహిళకు నీళ్లు తాగితే ప్రాణానికే ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా ఆహారం, పానీయాలు తినే అంత తింటేనే ఆరోగ్యం. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కానీ కొందరు తిండి విషయంలో సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు త్రాగాలని తరచుగా చెబుతుంటారు. అయితే నీరు ఎక్కువ త్రాగడం కూడా ప్రాణాంతకం అని మీకు తెలుసా?.. అయితే ఓ మహిళ.. నీరు ఎక్కువ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ వార్త చర్చనీయాంశమైంది.
ఆ మహిళ పేరు మిచెల్ ఫెయిర్‌బర్న్. కెనడా నివాసి అయిన మిచెల్ టిక్‌టాక్ లో చాలా ఫేమస్. అయితే సోషల్ మీడియాలో 75 హార్డ్ అంటూ ఓ ఛాలెంజ్ నడుస్తోంది. మిచెల్ ఈ ఛాలెంజ్‌ని తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వదులుకున్నారు. తన పరిస్థితి విషమించి చనిపోయేంతగా తయారైంది. అయితే.. చాలా శ్రమించిన వైద్యులు.. తన ప్రాణాలను కాపాడారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
Nirmala Sitharaman: ప్రతిపక్షాలది మొసలి కన్నీరు.. మణిపూర్ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి
75 హార్డ్ ఛాలెంజ్ అంటే ఏమిటి?
ఈ ఛాలెంజ్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని చేసే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేవాలి, వ్యాయామం చేయాలి, బయటి ఆహారం తినకూడదు, మద్యం మానేయాలి మరియు రోజూ 10 నిమిషాలు ఏదో ఒక పుస్తకాన్ని చదవాలి. ఈ ఛాలెంజ్‌లోని విచిత్రం ఏమిటంటే.. ప్రతిరోజూ తాగే నీటి పరిమాణాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజూ సోషల్ మీడియాలో తమ ఫొటోలను షేర్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ని ఫాలో అయిన మిచెల్.. వరుసగా 12 రోజులు 4-4 లీటర్ల నీరు తాగింది. ఆ తర్వాత తన ఆరోగ్యం క్షీణించింది.
Hyderabad Metro Expansion: హైదరాబాద్ మెట్రోపై కీలక నిర్ణయం.. అక్కడి వరకు మెట్రో సేవలు
నీరు త్రాగడం వల్ల ఈ తీవ్రమైన వ్యాధి వస్తుంది
మిచెల్ మళ్లీ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు తనకి సోడియం లోపం అనే వ్యాధి ఉందని తేలింది. రోజూ 4 లీటర్ల నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకిందని వైద్యులు తెలిపారు. తర్వాత ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు వైద్యులు ప్రతిరోజూ అరలీటర్ కంటే తక్కువ నీరు తాగాలని చెప్పారు. శరీరం లోపల సోడియం లోపం ప్రమాదకరమైన వ్యాధి అని తెలిపారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అని డాక్టర్లు సూచించారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!