BJP : 16నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. జేపీ నడ్డా పదవీకాలం పొడిగించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP : బీజేపీ జాతీయ కార్యవర్గం.. జనవరి 16-17 తేదీల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సందర్భంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడగింపును ఆమోదించే అవకాశం ఉందని మంగళవారం పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పార్టీ రాబోవు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం దాని వ్యూహంపై చర్చించనుంది. జాతీయ కార్యవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు సహా బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న జేపీ నడ్డా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ చీఫ్‌గా పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష శిబిరంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అభిప్రాయాలను వివరించే తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Noida: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. స్టూడెంట్లపైకి దూసుకొచ్చిన కారు
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా.. పార్టీలో ఐక్యతను తీసుకు రావడానికి అగ్రనేతలు ప్రయత్నించనున్నారు. G-20కి భారతదేశం అధ్యక్షత వహించినందుకు గుర్తుగా ప్రభుత్వం ప్లాన్ చేసిన దేశవ్యాప్త కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ ప్రయత్నాలను బీజేపీ ప్రశంసించడంతో పాటు దానిలో పాల్గొనడానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. కసరత్తులో కేడర్, వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై కూడా సమావేశంలో చర్చకు రావచ్చని వారు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయడం కూడా సమావేశంలో చర్చకు రావచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా , హోం మంత్రి అమిత్ షా కూడా పొడిగింపు పొందారు.
తాజావార్తలు
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!