Uttam Kumar Reddy : రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి అందే వరకు కొనసాగుతోందన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు… పాత కార్డులతో అదనపు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుతామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మొదట కుల గణన జాబితాలో ఉండి అర్హులైన వారికి ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల గణన జాబితా లో పేర్లు లేని వారు…గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. పాత రేషన్ కార్డులు కొనసాగుతాయని, ప్రజలు అపోహలు…ఆందోళన చెందకండని ఆయన వివరించారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించే వరకు ప్రక్రియ కొనసాగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
TJR Sudhakar Babu: చిన్న చిన్న కారణాలతో ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామనటం దుర్మార్గం..