తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈఏపీసెట్ పలితాలు విడుదలయ్యాయి. నేడు(ఆదివారం) ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొదటి ర్యాక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామ చరణ్ రెడ్డి రెండో ర్యాంక్ తో మెరిశాడు.…
తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు ఆదివారం (మే 11) విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. Also Read: KTR: స్థానిక ఎన్నికల్లో…
జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
TS Eamcet Results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (TS EAPCET) 2024 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు http://eapcet.tsche.ac.inలో అందుబాటులో ఉంటాయి.
NSUI Protest At JNTU: కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సటీ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. స్టూడెంట్ లీడర్ ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్ సమయంలో సరైన తరగతులు జరగక విద్యార్థులకు ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు…
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణ డిగ్రీలు…