Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. భద్రతా సిబ్బంది అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్నాథ్ యాత్రను ప్రతి హిందువు తమజీవితంలో ఒక్కసారైనా చేయాలనీ కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కానుంది. అయితే ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా భారత భద్రతా దళాలకు సమాచారం వచ్చింది.
Read Also: Meenakshi Chaudhary: ఏంటి పాప జాలి చూపిస్తున్నావా?
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
ఉగ్రవాదుల ముప్పు ఉందని సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుంచి పక్క సమాచారం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కశ్మీరీ యువకులకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అమర్నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యతను లోకల్ వ్యక్తులకు అప్పగించినట్లు సమచారం వచ్చింది.
Read Also: Jogi Ramesh : వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయి
కశ్మీర్ యువకులు స్థానికులు కావడంతో వీరికి చొరబాటు మార్గాలన్నీ తెలిసి ఉంటాయని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. రాజౌరీ–ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీతో పాటు మరిన్నీ ప్రాంతాల్లో ఉగ్రదాడికి జరిగే అవకాశముందని భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి భద్రతా సంస్థలు గాలిస్తున్నాయి. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు ముందే జమ్మూ కశ్మీర్ ను భద్రతా దళాలు తమ పర్యవేక్షణలోకి తీసుకున్నాయి. స్క్వాడ్ టీమ్‌లు, క్యూఆర్టి, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఎస్ఎస్బీ, భద్రతా ఏజెన్సీలు యాత్రికుల భద్రతను పటిష్టం చేశాయి.
తాజావార్తలు
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!