Terror Threats In Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేశారు.
జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కానుంది. అయితే ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా భారత భద్రతా దళాలకు సమాచారం వచ్చింది.