ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. వ్యక్తులు, సంస్థలు జన్మదినోత్సవాలు జరుపుకున్నట్టే తిరుపతికి కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి 893వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. దీంతో ఈ వేడుకలకు నగర వాసులు భారీగా పాల్గొన్నారు. తిరుపతి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు మరియు భక్తులతో నాలుగు మాఢ వీధులగుండా భారీ ర్యాలీ చేశారు. 24-2-1130 సౌమ్య నామ సంవత్సరం , ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర నక్షత్రం నాడు తిరుపతి నగరంలో భగవద్ రామానుజ చార్యుల వారు గోవింద రాజ స్వామిని ప్రతిష్టించారు.
Read Also:Wipro: జీతాల్లో కోతలు.. విప్రోపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగసంఘం డిమాండ్..
మొదట గోవింద రాజ పురం, ఆ తర్వాత రామానుజ పురం, 13 వ శతాబ్దం నుంచి తిరుపతి గా పిలవడం ప్రారంభం అయ్యింది. దీనికి చారిత్రక ఆధారాలు, శిలా శాశనాలు ఆధారాలుగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. స్థానిక గోవిందరాజులు స్వామి గుడి వద్ద వేద పండితులు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ల ప్రదర్శనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోవింద రాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, సారే తీసుకుని గోవింద రాజస్వామి ఆలయం లోకి తీసుకు వెళ్ళిన ఎమ్మేల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి నగరం 893 పుట్టిన రోజు సందర్భంగా గోవింద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Read Also: Gidugu Rudraraju: కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ పక్కా