ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 (WTC ఫైనల్ 2025) ఫైనల్‌లో నేడు నాల్గవ రోజు ఆట కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా గెలుపుకు 40 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు కెప్టెన్ టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతున్నా జట్టు గెలుపు కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. నొప్పితో మూలుగుతూ మ్యాచ్ ఆడటం కొనసాగించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బవుమా 65 పరుగులు చేశాడు. నాల్గవ రోజు ప్రారంభంలో, పాట్ కమ్మిన్స్ బవుమాకు పెవిలియన్ దారి చూపించాడు.
Also Read:Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
22వ ఓవర్లో బవుమాకు తొడ కండరాల నొప్పి వచ్చింది. నొప్పి ఉన్నప్పటికీ అతను బ్యాటింగ్ చేశాడు. అతను పరిగెడుతున్నప్పుడు, అతని ముఖ కవళికలను బట్టి బవుమా నొప్పిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. మూడవ రోజు విరామ సమయంలో, అతను నేలపై పడుకుని కనిపించాడు. అయినప్పటికీ, రిటైర్ హర్ట్ కావడానికి అంగీకరించలేదు. బవుమా 134 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, ఐడెన్ మార్‌క్రమ్ మధ్య 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Also Read:East Godavari: గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలు.. అరెస్టు చేసిన పోలీసులు
మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆడమ్ మార్క్రమ్ 102 పరుగులతో, బవుమా 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్ గురించి చెప్పాలంటే, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 207 పరుగులు చేసి బవుమా జట్టుకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం మార్ క్రమ్ 120 పరుగులు, డేవిడ్ గై బెడింగ్‌హామ్ 01 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. సఫారీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.
లార్డ్స్‌లో విదేశీ ఆటగాళ్లు నమోదు చేసిన 4వ ఇన్నింగ్స్ భాగస్వామ్యాలు
287* – లారీ గోమ్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్ (WI), 1984
185 – మైఖేల్ J క్లార్క్, బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా), 2009
147 – టెంబా బావుమా, ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా), 2025
126 – అజిత్ అగార్కర్, VVS లక్ష్మణ్ (భారతదేశం), 2002
119 – ఇయాన్ చాపెల్, రిక్ మెక్‌కోస్కర్ (ఆస్ట్రేలియా), 1975