పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణం తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్. ఇది పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా, అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుంది. విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తూ, తక్కువగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులను పరిష్కరిస్తున్నారు.
విజయం దిశగా కీలకమైనవి.
• దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ధృవీకరణ సమయం
• ఫీల్డ్ అధికారులకి డైనమిక్ అసైన్‌మెంట్ వలన పెండింగ్‌లు లేకుండా సమర్థత
• 95% కి పైగా పౌరుల సంతృప్తి రేటు (SMS ఫీడ్‌బ్యాక్ ఆధారంగా)
• రోజుకు సగటున 2000+ ధృవీకరణలు, వార్షికంగా 8 లక్షలకు పైగా
• ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా మోసపూరిత దరఖాస్తుల గుర్తింపు
• ఖర్చు తక్కువ – కొత్త పరికరాల అవసరం లేకుండా పనిచేసే యాప్
Also Read:Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
VeriFast ముఖ్య ఫీచర్లు:
• సమర్థమైన వర్క్‌ఫ్లో: వివిధ దశల ధృవీకరణతో తప్పులు తగ్గించి, బాధ్యత పెరగడం
• డైనమిక్ అసైన్‌మెంట్: ధృవీకరణ అధికారుల లభ్యత ఆధారంగా ఇతర అధికారులకు విధులను పంచడం (వర్క్ రీడిస్ట్రిబ్యూషన్)
• ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్: ఇంటెలిజెన్స్ డేటాబేస్‌తో పాత నేరస్థులను గుర్తించడం.
• SMS అలర్ట్స్: పౌరులకు తమ దరఖాస్తు ధృవీకరణ దశపై తక్షణ సమాచారం
• డేటా అనలిటిక్స్: రియల్ టైమ్, డేటా విశ్లేషణ ద్వారా క్రైం ట్రెండ్స్ అర్థం చేసుకోవచ్చు
• పారదర్శకత: ర్యాండమ్ అధికారుల నియామకం, అవినీతికి అడ్డుకట్ట
• : Android, iOS, Windows, Linux అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది
• ప్రజల సౌకర్యం కోసం తదుపరి మెరుగులు: పౌరులు తమకు అనుకూల సమయానికి అపాయింట్‌మెంట్ తీసుకునే అవకాశం
Also Read:Rajnath Singh: ఆపరేషన్ సిందూర్‌తో అన్ని లక్ష్యాలు సాధించాం
VeriFast యాప్ తెలంగాణ పోలీసుల సాంకేతిక వినియోగ సామర్థ్యానికి తలమానికంగా నిలుస్తోంది. ఇది సాంకేతికత ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి ప్రతిబింబంగా ఉంది. తెలంగాణ పోలీసులు పాస్‌పోర్ట్ ధృవీకరణలో “గోల్డ్ స్టాండర్డ్” నెలకొల్పినందుకు గర్వపడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల కోసం యోచిస్తున్నారు. జూన్ 24వ తేదీన న్యూడిల్లీలో, పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా, విదేశాంగ శాఖా మంత్రి చేతుల మీదుగా, బి. శివధర్ రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలంగాణ ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రం అందుకోనున్నారు.