పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణం తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్. ఇది పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా, అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుంది. విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తూ, తక్కువగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులను పరిష్కరిస్తున్నారు. Also…