Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- జగిత్యాల వాసి సుదర్శన్ మృతదేహం తెచ్చేందుకు ప్రభుత్వ సాయం
- సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు
- కామారెడ్డి వాసి అఫ్జల్ ఖాన్ మృతిపై కుటుంబంలో ఆందోళన
- విదేశాంగ శాఖ జోక్యంతో స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణకు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. జగిత్యాల జిల్లా హసనాబాద్ గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ సెప్టెంబర్ 1, 2026న డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సుదర్శన్ గౌడ్ భార్య వైలాల భార్గవి ప్రజావాణి కార్యక్రమంలో తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సుదర్శన్ గౌడ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కుటుంబ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకునేలా సహకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
కామారెడ్డి వాసి అఫ్జల్ ఖాన్ మృతిపై ఆందోళన
ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి మరణించి ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (43) 2026 ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లాడు. చమురు పరిశ్రమలో పౌర ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆయనను మోసపూరితంగా అక్కడికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా అఫ్జల్ ఖాన్ యుద్ధంలో మరణించినట్లు పేర్కొంటూ ఓ వాయిస్ మెసేజ్ వచ్చినట్లు వారు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా తరఫున పోరాడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సందేశంలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
అఫ్జల్ ఖాన్ కుటుంబ సభ్యులను మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) నాయకుడు అంజదుల్లా ఖాన్ కలిశారు. అఫ్జల్ ఖాన్ ఆచూకీని నిర్ధారించి, కుటుంబానికి వాస్తవాలు తెలియజేయాలని ఆయన భారత విదేశాంగ శాఖతో పాటు మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. రష్యా అధికారులతో అత్యవసరంగా సంప్రదింపులు జరిపి అఫ్జల్ ఖాన్ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన మరణం నిజమని తేలితే, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. తమ కుటుంబ సభ్యుడి గురించి స్పష్టమైన సమాచారం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!