Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
Ragging Shocks JNTU Nachupally Campus in Jagtial: చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తే.. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు విద్యార్థులు.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది.
Adluri Laxman : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “మా ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తవ్వకముందే బీఆర్‌ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తమ వాగ్దానాలను అమలు చేయలేదు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై బోగస్ ఆరోపణలు చేయడం…
Jeevan Reddy : జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో రాజకీయ వేడి పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మడిగే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ముసుగులో వచ్చిన వాళ్ల కంటే మనం గట్టిగానే ఉన్నాం.…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ఊహగానాలను కొట్టి పడేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి… వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న…
Jagtial News: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూలాగానే తెల్లవారు జామున నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలు దేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.