Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- మంత్రి హామీతో తాత్కాలికంగా ఆందోళనకు విరామం
- మౌలిక సదుపాయాల కొరతతో వైద్య సేవలకు ఇబ్బందులు
- గతంలోనే నోటీసు ఇచ్చినా పరిష్కారం కాలేదంటున్న జూడాలు
- పది రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ సమ్మె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కొరతను నిరసిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ధర్నాను తాత్కాలికంగా నిలిపివేసే అంశంపై వైద్యుల బృందం ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ సమ్మె చేపట్టవచ్చని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ హామీపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మౌలిక సదుపాయాలు లేక వైద్య సేవలకు ఇబ్బందులు
ఉస్మానియా ఆస్పత్రి పరిధిలోని పది ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 450 మంది జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడం కష్టంగా మారుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స అందించేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల వైద్యులతో పాటు రోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. జూడాల ఆందోళన కారణంగా ఓపీ సేవలకు వచ్చే రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు, వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా విధులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆందోళనకారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
పది రోజుల గడువుపై వైద్యుల అసంతృప్తి
ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన పది రోజుల గడువుపై కొందరు జూనియర్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్యలపై రెండు నెలల క్రితమే వైద్య విద్యా సంచాలకులకు (DME) నోటీసు ఇచ్చినా పరిష్కారం లభించలేదని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఇంతకాలం పరిష్కారం కాని సమస్యలను మరో పది రోజుల్లో ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కొందరు వైద్యులు పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో ధర్నా తాత్కాలిక విరామానికే పరిమితం అవుతుందా? లేక వైద్యులు మళ్లీ ఆందోళనకు దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయా లేదా అన్నది రాబోయే పది రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!