Inter Results: నేడు ఇంటర్ ఫలితాలు.. తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జాగ్రత్త?
- తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు
- ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలు
- ఈ సారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి
- మీ పిల్లల్ని ఇతరులతో పొల్చొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
READ MORE: Sai Pallavi : అవార్డుల కన్న నాకు ప్రేక్షకులే ముఖ్యం..
Also Read
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
- Lashkar-e-Taiba: ఇజ్రాయెల్‌తో సంబంధం పెట్టుకుంటే చంపేస్తాం.. షరీఫ్, మునీర్‌కు లష్కరే వార్నింగ్
ప్రస్తుత పోటీ ప్రపచంలో మార్కులు, ర్యాంకుల ఆధారంగానే ప్రతిభను గుర్తిస్తున్నారు. ఈ వ్యవస్థ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ఎంత ఖర్చయినా సరే పేరున్న స్కూల్‌లో చేర్పించాలనేది తల్లిదండ్రుల తాపత్రయం. అందులో బాలల నైపుణ్యాలను వెలికితీసే ఎందురు నిపుణులు ఉన్నారనేది చూడటం లేదు. కళాశాలలో పోటీ, ఒత్తిడి తట్టుకోలేక మార్కుల్లో, గ్రేడ్‌లో తగ్గితే బాలలను నిరాశకు గురి చేస్తున్నారు. అటు కళాశాలలో.. ఇటు ఇంట్లో మందలిస్తుండటంతో పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచన చేయడం దురదృష్టకరం. మనోధైర్యమే భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
READ MORE: Inter Results: అలర్ట్.. నేడే ఇంటర్ ఫలితాలు… ఎన్ని గంటలకంటే?
ఈ ఏడాది తప్పకుండా ఆత్మహత్యల నివారణకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షల ఉత్తీర్ణత సమయంలో ఫెయిల్ ఆయినా విధ్యార్థులు ఆందోళన పడనవసరం లేదని, సంప్లిమెంటరీ పరీక్షలలో వారికి విజయం వరిస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. వీరిపై తల్లిదండ్రులు ఎవ్వరు ఒత్తిడి చేయడం, విసుగు చెందడం చేయకూడదు. మానసిక ఒత్తిడిని జయించటం కోసం ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయమం, సరైన నిద్ర సరదాగ స్నేహితులతో గడపటం చేయాలి. తల్లి దండ్రులు ఎప్పుడు పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకుండా వారిని తక్కువ భావానికి గురి చేయకుండా ఉండాలి. పిల్లలు ఒత్తిడికి ఏమైనా గురైనట్లు అనిపిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
తాజావార్తలు
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!