తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు…
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు…
ఐఐటీ గౌహతిలో ఓ విద్యాకుసుమం రాలిపోయింది. విద్యావ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయి. దీంతో పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యార్థి మృతికి ఒత్తిడే కారణమని ఆరోపించారు. దీంతో నిరసనలకు తలొగ్గి ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వి.కృష్ణ రాజీనామా చేశారు.