Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు. నవమాసాలు ఎంతో కష్టాన్ని ఓర్చి కని.. తన చేతులతోనే నీళ్ల టబ్బులో ముంచి చంపింది. ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయ విదారక ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం జరిగింది.
Read Also:Kamareddy : సహజీవనం చేస్తూనే రూ.6వేల కోసం గొడవ.. మహిళ ఇంటికి నిప్పు
వివరాల్లోకి వెళితే….రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్(34), భారతి(25)కి 2020లో పెళ్లైంది. ఉపాధి కోసం పట్నం వలస వచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసముంటున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు కలిగారు. వీరికి విక్కీ(18 నెలలు), లక్కీ(8నెలలు). శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీనివాస్, భారతి మధ్య మనస్పర్ధలు తల్లెత్తాయి. ముఖ్యంగా అత్త, కోడళ్లకు అసలు పడేది కాదు. ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి శనివారం జిల్లెలగూడలోని వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ భారతిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఉదయం భారతి తల్లిదండ్రులను తన ఇంటికి రప్పించుకుంది. వారు కూతురికి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. వారితో పాటే శ్రీనివాస్ కూడా బయటికి వెళ్లిపోయాడు.
Read Also:Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్‌డే గిఫ్ట్ వచ్చేనా?
ఇంట్లో ఎవరి లేని సమయంలో దారుణంగా ప్రవర్తించింది. కన్న పేగు బంధాన్ని మరిచింది. తన ఇద్దరు కొడుకులని ఓ నీళ్ల టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం.. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. శ్రీనివాస్ తన భార్య భారతికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో హుటాహూటినా ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్ తన పిల్లలను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో భారతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.