ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు..
గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
Good News: చదువుతో పాటు విద్యార్థుల ఆకలి తీర్చుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మధ్యాహ్నా భోజనం అమలవుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.