గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు.…