KTR Press Meet: అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Press Meet at TUWJ: తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదని, అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరూ రెండో శ్రేణి పౌరులు అంటూ ఉండరన్నారు. తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ మీట్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.
‘ఎట్లా ఉండే తెలంగాణ.. ఎట్లా అయ్యింది అన్నది ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుందని దేశం అనుసరిస్తుంది. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోంది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్. తెలంగాణ కర్ఫ్యూ లేదు.. కరువు లేదు. మోడీ హయాంలో పేదరికంలో నైజీరియాను ఇండియా దాటింది. దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్-5లో ఉంది. ఒక్క పైసా అప్పు చేసిన ఉత్పదాక రంగం మీద పెట్టారు సీఎం కేసీఅర్. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతుంది అక్కడి ప్రభుత్వం. మన దగ్గర 24 గంటల కరెంట్’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read
‘కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయి. కానీ బీఆర్ఎస్ అలా కాదు. అప్పట్లో ఒక ప్రభుత్వం ప్రో అర్బన్, ప్రో ఐటీ రంగంపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత వచ్చిన సర్కార్ వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. కేసీఅర్ సర్కార్ పూర్తి సమతూకంతో ముందుకు సాగుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. పట్టణ, పల్లెల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. వ్యవసాయంలో ముందుకు దూసుకుపోతుంది. పంజాబ్, హర్యాలను దాటింది. రాష్ట్రంలో ఏ మూలాన వెళ్లినా పచ్చదనమే కనబడుతుంది’ కేటీఆర్ తెలిపారు.
Also Read: Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!
ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ కాకుండా దేశంలో వేరే రాష్ట్రం ఒక్కటి అయినా ఉందా?. టీచర్ రిక్రూట్ మెంట్ అంటే ఒక డీఎస్ఈ నేనా?.. గురుకులాల్లో వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. కర్ణాటక నుంచి రైతులను స్పాన్సర్ చేసి తీసుకువస్తున్నారు అని కాంగ్రెస్ నేత అంటున్నారు. మరి మనం పోదాం కర్ణాటకకు.. అక్కడి వెళ్లి ఏం జరుగుతుంది చూద్దాం. మేము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదు. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు’ అని కేటీఆర్ చెపుకొచ్చారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!