Person came to the polling station with Oxygen Cylinder to Cast his Vote: ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి పోలింగ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కి వచ్చారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య (75) లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఓటు వేయడానికి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్ పోలింగ్ కేంద్రంలో శేషయ్య ఓటు వేశారు. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యత అని శేషయ్య చెప్పారు. శేషయ్యకు సంబందించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: CM KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్.. రెండు చోట్ల గట్టి ప్రత్యర్థులే!
మరోవైపు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యానగర్‌లోని హిందీ మహావిద్యాలయంలో ఆయన ఓటు వేశారు. అయన వయసు 99 కావడం విశేషం. వీల్ చైర్ సాయంతో వచ్చిన చుక్కా రామయ్య ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.