Government Proposals: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం సర్వత్రా ఆశక్తి నెలకొంది. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ప్రభుత్వం వైపు నుంచి సర్కార్.. టాలీవుడ్‌కు ఐదు ప్రతిపాదనలు చేయనుంది. అనంతరం సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు సినీ ప్రముఖుల ముందు వాస్తవాలు ఉంచునున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట వీడియోలు సైతం సినిమా ప్రముఖులుకి చూపించునున్నారు.
టాలీవుడ్‌కు ఐదు ప్రతిపాదనలు ఇవే..
1. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పొల్గొనాలి..
2. సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి..
3. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంకు తారలు సహకరించాలి..
4. బెనిఫిట్ షోలు, స్పెషల్ గా టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు
5. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు సహకరించాలి
Read also: SP Sindhu Sharma: వీడిన ఎస్సై మిస్సింగ్ మిస్టరీ.. జిల్లా ఎస్పీ సింధు శర్మ కామెంట్స్..
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేరుకున్నారు. సీఎంతో భేటీకి ఉదయం నుంచి సినీ ప్రముఖులు కమాండ్ కంట్రలోల్ సెంటర్ కు చేరుకున్నారు. సీఎంతో పలు అంశాలపై చర్చించనున్నారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం భేటీ కానున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు విషయాలను భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Tollywood Industry Meeting Live Updates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం.. లైవ్ అప్‌డేట్స్!