CM Revanth Comments: టాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పింది. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. ప్రభుత్వ తరుఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యుల హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండ్రస్టీ సభ్యులు మాట్లాడారు.
Read also: Chikkadpally Police: సినీ ప్రముఖుల ముందుకు సంధ్య థియేటర్ ఘటన వీడియోలు..
బెనిఫిట్‌షోల పై చర్చ మొదలవ్వగా దీనిపై స్పందించిన సీఎం మాట్లాడుతూ.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..! అన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు.
Read also: Bhadrachalam: రామయ్య సన్నిధిలో కొత్త విధానం.. అన్నదాన సత్రంలో డిజిటల్ టోకెన్లు..
డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలన్నారు. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని తెలిపారు.
Read also: Government Proposals to Tollywood: టాలీవుడ్‌కు ప్రభుత్వం ఐదు ప్రతిపాదనలు..
సీఎంతో సినీ ప్రముఖులు..
రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను.. హైదరాబాద్‌లో నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరారు.
Read also: CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది..
నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని తెలిపారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అన్నారు.
Read also: IRCTC: ఐఆర్‌సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు
మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని తెలిపారు. సినిమా రిలీజ్‌లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు.
Read also: Automobile Sales in 2024: వాహనాల కొనుగోలులో నంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్రం ఇదే..
శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని తెలిపారు. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని తెలిపారు.
Read also: SP Sindhu Sharma: వీడిన ఎస్సై మిస్సింగ్ మిస్టరీ.. జిల్లా ఎస్పీ సింధు శర్మ కామెంట్స్..
దగ్గుబాటి సురేష్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని తెలిపారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో.. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని గుర్తు చేశారు.
Sonu Sood:”నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది”.. రాజకీయరంగ ప్రవేశంపై సోనూసూద్ క్లారిటీ