CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్‌స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 86 శాతం పూర్తయిందన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయని.. టెర్మినల్ 79, ఏటిసి 90, బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68 శాతం పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్ లో ఎయిర్ పోర్ట్…
AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ. 21,616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.…
ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో…
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు."రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఎస్ఎల్‌బీసీటన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎదురవుతున్న ఆటంకాలపై NGRI శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో.. యాడిట్ ఏర్పాటుపై అధికారులు చర్చిస్తున్నారు. తిర్మలాపూర్ సమీపంలో ఏర్పాటుకు వెసులుబాటు ఉంది. 1994 ఏప్రిల్ 22న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. కాగా.. ద్వారంతో టన్నెల్ తవ్వకం సులభమయ్యే ఛాన్స్ ఉంది. Read…