చలికాలంలో కూడా కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది.. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. మరికొందరు అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు.. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. శరీరంలో వేడి బాగా పెరిగడమే.. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే షుగర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.. అందుకే శరీరంలో వేడిని చిటికెలో తగ్గించే జ్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి తగ్గేందుకు ఇంట్లోనే ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల వేడి తగ్గడంతో పాటు.. ఇన్ స్టంట్ ఎనర్జీని పొందవచ్చు. ఈ జ్యూస్ పేరు రోజ్ యాపిల్ జ్యూస్.. ఎలా తయారు చెయ్యాలంటే.. రోజ్ యాపిల్స్,కలబంద గుజ్జు,తేనే నిమ్మరసం,చిన్న అల్లం ముక్క ఒక్కటి.. ఈ పదార్థాలతో జ్యూస్ ను ఎలా తయారు చెయ్యాలంటే..
ముందుగా కలబంద గుజ్జును ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 6 రోజ్ యాపిల్స్ ముక్కలు, అల్లం ముక్క వేసి.. కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకుని.. అందులో తగినన్ని చల్లటినీళ్లు పోసుకుని కలుపుకోవాలి. రుచికి సరిపడా తేనె, నిమ్మరసం వేసి కలపాలి. ఈ జ్యూస్ ను రోజు తాగితే ఒంట్లో వేడి మాయం అవుతుంది అంతేకాదు ఎన్నో అనారోగ్యం సమస్యలు దూరం అవుతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.