Tejas Mk-1A: శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే పేరు.. తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్. తాజాగా ఈ యుద్ధ విమానం వార్తల్లో నిలిచింది. తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్‌ను అందుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి మరో ఇంజిన్ అందుతుందని HAL పేర్కొంది. 2025 అక్టోబర్‌లో రెండు తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్‌లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికారిక వర్గాలు వెల్లడించాయి.
READ ALSO: Akhilesh Yadav: ” ఇదే కొనసాగితే, భారత్‌లో నేపాల్ లాంటి పరిస్థితి” అఖిలేష్ యాదవ్ వార్నింగ్..
సెప్టెంబర్‌లో పరీక్షలు..
సెప్టెంబర్‌లో యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A పరీక్షలు నిర్వహించనున్నట్లు హెచ్ఏఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి, ASRAAM షార్ట్ రేంజ్ క్షిపణి, లేజర్ గైడెడ్ బాంబులను తేజస్-మార్క్ 1A ద్వారా ప్రయోగించనున్నారు. గతంలో నిర్వహించిన రెండు పరీక్షలలో ఒక విజయం, ఒక వైఫల్యం నమోదు అయ్యాయి. దీని తర్వాత HAL సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. తాజాగా నిర్వహించే పరీక్షలు విజయవంతం అయిన తర్వాతే విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించనున్నారు.
డెలివరీ వేగాన్ని పెంచనున్న ఇంజిన్..
అమెరికన్ కంపెనీ GE వచ్చే ఏడాది మార్చి నాటికి తేజస్ కోసం 10 ఇంజిన్లను, డిసెంబర్ 2026 నాటికి మరో 20 ఇంజిన్లను అందించనుంది. ఈ ఇంజిన్ల రాక వైమానిక దళానికి తేజస్ డెలివరీ వేగాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. భారత వైమానిక దళానికి ఫైటర్ స్క్వాడ్రన్ల కొరత పెద్ద సవాలుగా మారింది. వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ మాట్లాడుతూ.. వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు అవసరం, కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 31కి తగ్గింది. సెప్టెంబర్ 26న మిగ్-21 రెండు స్క్వాడ్రన్ల విరమణ తర్వాత, ఈ సంఖ్య కేవలం 29కి పడిపోనుంది. పాకిస్థాన్, చైనాతో రెండు వైపులా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో స్క్వాడ్రన్లు అవసరాన్ని గుర్తించాలని అన్నారు.
బికనీర్‌లో మోహరింపు..
తేజస్-మార్క్ 1A మొదటి మోహరింపు బికనీర్ ఎయిర్‌బేస్‌లో ఉండనుంది. ఈ స్క్వాడ్రన్ ఇప్పటివరకు మిగ్-21 బైసన్‌తో పనిచేస్తోంది. తేజస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్క్వాడ్రన్ భారత వైమానిక దళం కొత్త ఆధునిక శక్తికి చిహ్నంగా మారుతుంది. ఇంజిన్ సరఫరా, డెలివరీ షెడ్యూల్ వేగవంతం కావడంతో, భారత వైమానిక దళం బలం త్వరలో రెట్టింపు కానుంది. పాత తేజస్‌తో పోలిస్తే తేజస్ Mk-1A ఫైటర్ జెట్‌లో 40 కి పైగా మెరుగుదలు చేశారు. 2029 నాటికి మొత్తం 83 విమానాలు వైమానిక దళానికి అందనున్నాయి.
తేజస్ Mk-1A ప్రత్యేకత ఏంటి?
ఈ అధునాతన యుద్ధ విమానం.. స్టీల్త్, రేంజ్, ఆయుధాలలో JF-17 కంటే ముందుంది. తేజస్ J-10C కంటే చురుకైనది. EW (ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్) వ్యవస్థలో బలంగా ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలవనుంది. మొదటి రెండు తేజస్ Mk-1A జెట్‌లు అక్టోబర్‌లో వైమానిక దళానికి డెలివరీ చేయనున్నారు. క్రమంగా ఇది IAF అత్యంత ముఖ్యమైన శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.
తేజస్ Mk-1A ప్రత్యేకతలు..
బరువు: 6,500 కిలోలు (ఖాళీ), తేలికైనది, చురుకైనది.
ఇంజిన్: GE F404-IN20, థ్రస్ట్ 90 kN.
వేగం: మాక్ 1.8 (2,220 కి.మీ/గం).
రాడార్: EL/M-2052 AESA, లక్ష్యాన్ని గుర్తింపు పరిధి 200 కి.మీ.
పరిధి: 500 కి.మీ, పేలోడ్: 5,300 కి.గ్రా.
ఆయుధాలు: ఆస్ట్రా Mk1/Mk2 (BVR, 110 కి.మీ), ASRAAM (షార్ట్ రేంజ్), డెర్బీ, లేజర్ గైడెడ్ బాంబులు, రాకెట్లు.
EW సూట్, మిషన్ కంప్యూటర్, చాఫ్-ఫ్లేర్ పూర్తిగా స్వదేశీ.
9 హార్డ్ పాయింట్లపై ఆయుధాలను మోయగల సామర్థ్యం.
పాకిస్థాన్ JF-17 థండర్‌తో పోలిస్తే..
JF-17 థండర్ అనేది చైనా-పాకిస్థాన్‌ల 4వ తరం జెట్ విమానం.
బరువు: 7,900 కిలోలు, పరిధి: 1,200 కి.మీ, థ్రస్ట్: 84 కి.నీ.
రాడార్: KLJ-7A AESA, పరిధి 170 కి.మీ.
వేగం: Mac 1.6.
పేలోడ్: 3600 కిలోలు.
RCS: 1 m² (తేజస్ 0.5 m², అంటే ఎక్కువ స్టెల్త్) తేజస్ వేగవంతమైనది, చురుకైనది, మెరుగైన ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
చైనా J-10C తో పోలిస్తే..
J-10C అనేది చైనా 4.5 తరం జెట్.
బరువు: 9,750 కి.గ్రా, పరిధి: 1,100 కి.మీ, థ్రస్ట్: 140 కి.నా.
వేగం: Mac 2.1
పేలోడ్: 6,000 కిలోలు
RCS: 1 m² (తేజాస్ కు 0.5 m²) J-10C సుదూర పరిధిలో బలంగా ఉంటుంది. ఈ రెండు ఫైటర్ జెట్‌ల కంటే తేజస్ ఫైటర్ జెట్ తేలికైనది, చురుకైనది. ఇప్పుడు భారత్ శత్రుదేశాలకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది.
READ ALSO: BSNL Offer: మూడు రోజుల్లో ముగియనున్న బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. ప్లాన్ ఏంటో తెలుసా!