Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘‘ఓటు చోరి’’ కొనసాగితే భారతదేశంలో కూడా నేపాల్ లాంటి పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్ రాజకీయాలను ప్రస్తావించారు. “ఇలాంటి ఓట్ల దొంగతనం జరుగుతూనే ఉంటే, పొరుగు దేశాలలో వీధుల్లో కనిపించే వ్యక్తుల మాదిరిగానే, ఇక్కడ కూడా ఇది కనిపించవచ్చు” అని అన్నారు.
Read Also: Venkaiah Naidu : బ్రహ్మానందం కనిపిస్తేనే నవ్వొస్తుంది.. ఆత్మకథ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య..
నేపాల్‌లో రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ హింసలో 51 మంది మరణించారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. కొత్తగా తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీని జెన్-జెడ్ నిరసనకారులు ప్రతిపాదించారు. ఆమె శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ మాత్రంమే కాకుండా భారత్ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్‌లలో కొన్ని ఏళ్లుగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల అవసరం ఉందని, దీనిపై ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు సూచనలు ఇస్తోందని, ఎన్నికల కమిషన్ వారి ఆదేశాలను పాటిస్తుందనే నమ్మకం తమకు ఉందని, ఎన్నికల కమిషన్ బీజేపీ తాత్కాలిక కమిషన్‌గా మారకుండా, నిష్పాక్షి ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలని కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ‘‘ఓటు చోరీ’’ జరిగిందని ఆరోపిస్తున్నారు. కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఓటు చోటీ చేయడానికి బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్నారు.