BSNL Offer: టెలికాం సంస్థలకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సాధ్యమైనంత గట్టి పోటీ ఇస్తుంది. తనకంటూ బలమైన నెట్‌వర్క్‌ను బిల్డ్ చేసుకుంటూ రోజురోజుకు యూజర్ ఫ్రెండ్‌లీ మారుతుంది. ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్‌లోకి సూపర్ ప్లాన్‌లను తీసుకువస్తుంది. అలా తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చూసుకోండి మరి.. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: AP Crime: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం.. మరో యువకుడి ఎంట్రీతో..!
ఈ ప్లాన్ కొత్త సిమ్ తీసుకునేవారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. కేవలం రూ.1 తోనే సిమ్ కొనుగోలు చేసి 30 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రత్యేక ఆఫర్‌లో తన వినియోగదారులకు అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఉచిత SMSలను ఇస్తుంది. దీనితో పాటు కస్టమర్లకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్‌లు, రీఛార్జ్ బోనస్, MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్ నుంచి సులభమైన యాక్టివేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
యాక్టివేట్ చేయడం ఎలా..
కస్టమర్లు USSD కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నుంచి BSNL సూచించిన షార్ట్ కోడ్‌ను డయల్ చేయాలి. అప్పుడు ఆఫర్ వెంటనే ప్రారంభమవుతుంది. ఇది మొదటి 30 రోజులు పూర్తిగా ఉచితం. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి మీరు రూ. 1 టోకెన్ ఫీజు చెల్లించాలి. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత మీకు నచ్చిన ఏదైనా సాధారణ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నంబర్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. అలాగే దీనిని మరో పద్దతిలో కూడా యాక్టివేట్ చేయవచ్చు. ముందుగా MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి అక్కడ నుంచి “ఫ్రీడమ్ ఆఫర్” ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత రూ.1 మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ పూర్తయిన వెంటనే, 2GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం మీ నంబర్‌లో వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఇంకేందుకు ఆలస్యం.. మీకు బంఫర్ ఆఫర్ నచ్చితే వెంటనే బీఎస్ఎన్ఎల్‌కు షిఫ్ట్ కొట్టేయండి మరి.
READ ALSO: Karnataka Crime: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు