టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.మన దేశంలో రిలీజైన మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీగా హనుమాన్ మూవీ నిలిచింది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అతి తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్ తో హనుమాన్ ను తెరకెక్కించారంటూ ప్రేక్షకులు మూవీ టీం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు మెగా హీరో సాయి ధరమ తేజ్ వంటి సినీ ప్రముఖులు హనుమాన్ చిత్ర యూనిట్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా టాలీవుడ్ దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు హనుమాన్ సినిమాను వీక్షించారు. అనంతరం హనుమాన్ మూవీ పై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
‘సంక్రాంతి పండగ వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు’ అని ఆయన తెలుగులో ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు.సూపర్ హీరో కాన్సెప్ట్‌కు రామాయణం ఇతిహాసాన్ని జోడించి ప్రశాంత్ వర్మ హనుమాన్ ను తెరకెక్కించాడు. సంక్రాంతి బరిలో మహేశ్, వెంకటేష్ మరియు నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలున్నా కంటెంట్‌పై వున్న నమ్మకం తో హనుమాన్ మూవీను సంక్రాంతి కే రిలీజ్ చేశారు మేకర్స్. వారి భావించినట్టుగానే సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో అక్క పాత్రలో మెరిసింది.ఈ సినిమాలో వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు.అలాగే ఈ సినిమాలో రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సముద్ర ఖని, గెటప్ శీను, సత్య మరియు రోహిణీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది.
ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు pic.twitter.com/yA4LPuL5GF— Raghavendra Rao K (@Ragavendraraoba) January 14, 2024