IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
- భారత్ ఘన విజయం
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం
- మంచి స్కో్ర్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. భారత్ 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగుల సాధించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని భారత్ అధిగమించింది. కెప్టెన్ 76 రన్స్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయినప్పటికీ.. శ్రేయస్ అయ్యర్ (48) మాత్రం మెరిశాడు. భారత్‌కు ఇది మూడో ట్రోఫి.. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
READ MORE: INDvsNZ Final: రోహిత్ శర్మ గొంతులో పురుగు.. ఆందోళనకు గురైన రితిక
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
మొదట రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. శాంట్నర్ వేసిన 18.4 ఓవర్‌కు గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ అందుకోవడంతో శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరాడు. అనంతరం రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ(1) బ్రాస్‌వెల్ వేసిన 19.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. రచిన్ రవీంద్ర వేసిన ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ స్టంపౌటయ్యాడు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 రన్స్ పూర్తి చేసుకున్నాడు. భారత్ కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌండ్రీలతో ఊపు తెచ్చిన అక్షర్(29).. మిచెల్ శాంట్నర్ వేసిన 41.3 ఓవర్‌కు ఓరూర్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి బంతిని బౌండ్రరీకి తరలించాడు. హార్దిక్ పాండ్యా (18), కేఎల్ రాహుల్ (32), జడెజా(5) పరుగులతో భారత్‌ను గెలిపించారు.
READ MORE: Turkey: టర్కీ మానవరహిత విమానం ప్రయోగాలు పూర్తి.. భారత్‌కి చిక్కులు..
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?