Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- టర్కీ బుద్ధి మారలేదు
- యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- యూఎన్‌లో ఏడోసారి కాశ్మీర్ ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ తన వంకర బుద్ధి ప్రదర్శించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. 2019 తర్వాత యూఎన్ జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇది ఏడోసారి. భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. భారత్-పాకిస్థాన్ మధ్య వివాదంగా ఉన్న కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తూ టర్కీ తన వైఖరిని కొనసాగించింది.
యూఎన్‌లో ఎర్డోగాన్ మాట్లాడుతూ.. దక్షిణాసియాలోని అన్ని వివాదాలను.. ముఖ్యంగా కాశ్మీర్ సమస్యను, ఐక్యరాజ్యసమితి చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఎర్డోగాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించడం ద్వారా పాకిస్థాన్‌కు టర్కీ దౌత్యపరమైన మద్దతు ఇస్తోందనే అభిప్రాయం ఉంది.
Also Read
- LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
- Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
2019 నుంచి ఏడుసార్లు..
2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ఎర్డోగాన్ యూఎన్జీఏ వేదికగా తొలిసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత 2020లో 75వ యూఎన్జీఏ సమావేశంలో వర్చువల్ ప్రసంగం సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2021లోనూ దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అవసరమని అన్నారు. 2022, 2023లోనూ కాశ్మీర్ వివాదాన్ని చర్చలు, అంతర్జాతీయ సూత్రాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాల నేపథ్యంలో ప్రస్తావించారు. 2024 ప్రసంగంలో కాశ్మీర్‌ను ప్రస్తావించని ఎర్డోగాన్.. 2025లో మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా 2026లో 81వ యూఎన్జీఏలోనూ మరోసారి కాశ్మీర్‌ను ప్రస్తావించడంతో 2019 తర్వాత ఏడుసార్లు ఈ అంశాన్ని లేవనెత్తినట్లైంది.
పాకిస్థాన్‌కు ఎందుకు మద్దతు?
టర్కీ, పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముస్లిం మెజారిటీ దేశాలకు సంబంధించిన అంశాల్లో టర్కీ తన దౌత్యపరమైన వైఖరిని చురుకుగా వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వైఖరికి మద్దతు ఇవ్వడం కూడా ఈ విస్తృత దౌత్య విధానంలో భాగంగా కనిపిస్తోంది. టర్కీ అధికారికంగా కాశ్మీర్ వంటి వివాదాలను చర్చల ద్వారా, యూఎన్ చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో పరిష్కరించుకోవాలని చెబుతోంది. పాకిస్థాన్ ఎర్డోగాన్ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా.. భారత్ మాత్రం మూడోపక్ష జోక్యాన్ని తిప్పికొట్టింది.
కాశ్మీర్‌పై భారత్ వైఖరి?
జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని న్యూఢిల్లీ తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెబుతోంది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా భారత్ తన వైఖరికి ఆధారంగా ప్రస్తావిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై టర్కీ నేతలు కాశ్మీర్‌ను ప్రస్తావించడాన్ని భారత్ గతంలో పలుమార్లు వ్యతిరేకించింది. ఇలాంటి వ్యాఖ్యలను భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా పరిగణిస్తోంది.
ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎందుకు కీలకం?
ఎర్డోగాన్ తాజా వ్యాఖ్యలకు కొన్ని వారాల ముందే టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియా కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆగస్టు 7, 2026న మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. దానిని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా ఉమ్మడి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసుకున్నది కాదని స్పష్టం చేశారు. శాంతి, భద్రత, స్థిరత్వం కోసం స్నేహపూర్వక దేశాలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించే అవకాశం ఉందని తెలిపారు.
భారత్‌కు దీని అర్థమేంటి?
ఎర్డోగాన్ ఏడోసారి కశ్మీర్‌ను ప్రస్తావించడం భారత్-టర్కీ మధ్య మరో దౌత్యపరమైన విభేదానికి కారణమయ్యే అంశంగా మారింది. ముఖ్యంగా టర్కీ, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలతో పాటు ఇప్పుడు రక్షణ సహకారం కూడా మరింత అధికారిక రూపం దాల్చింది. అయితే మక్కా రక్షణ ఒప్పందం కాశ్మీర్‌పై భారత్ వైఖరిని మార్చదు. అదే సమయంలో కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు టర్కీ ఇస్తున్న దౌత్య మద్దతు కొనసాగుతోందనే విషయాన్ని ఎర్డోగాన్ తాజా వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల తాజా యూఎన్జీఏ వ్యాఖ్యలను కేవలం కాశ్మీర్‌పై టర్కీ పాత వైఖరి కొనసాగింపుగా మాత్రమే కాకుండా.. టర్కీ-పాకిస్థాన్ సంబంధాలు, కొత్త మక్కా రక్షణ ఒప్పందం నేపథ్యంలోనూ చూడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?