2023 జనవరిలో పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ అనేదే లేని ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇవ్వడం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొదటిసారి. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తాను ఎన్నేళ్లైనా బాలీవుడ్ బాద్షానే అని నిరూపిస్తూ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసాడు. తనతో తనకే పోటీ, తనకి తానే పోటీ అన్నట్లు షారుఖ్ ఖాన్ సరిగ్గా ఎనిమిదిన్నర నెలలకే జవాన్ గా బాక్సాఫీస్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ పఠాన్ రికార్డులని వెంటాడుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. బాలీవుడ్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ థౌజండ్ క్రోర్ గ్రాస్డ్ మూవీగా జవాన్ నిలవనుంది అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా జవాన్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. పఠాన్ రికార్డ్స్ ని అతి త్వరలో షారుఖ్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే జవాన్ ఎన్ని పఠాన్ రికార్డులని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసినా ఒక్క విషయంలో మాత్రం పఠాన్ ని జవాన్ దాటలేకపోతుంది.
ఓవర్సీస్ లో జవాన్ సినిమా ఇప్పటివరకూ 310 కోట్లు రాబట్టింది. 14 రోజుల్లో షారుఖ్ చేసిన ఈ విధ్వాంసం ఏ ఇండియన్ హీరో వల్ల అవ్వదేమో. జవాన్ తో ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, పఠాన్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ ని మాత్రం బ్రేక్ చేసేలా కనిపించట్లేదు. ఓవర్సీస్ లో పఠాన్ సినిమా ఓవరాల్ గా 400 కోట్లు రాబట్టింది. ఈ బెంచ్ మార్క్ ని చేరుకోవాలి అంటే జవాన్ సినిమాకి ఇంకా 90 కోట్లు కావలి. మూడో వారం లోకి ఎంటర్ అయిన జవాన్ సినిమా బుకింగ్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. కలెక్షన్స్ తగ్గుతున్నాయి కాబట్టి జవాన్ సినిమాకి పఠాన్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ ని అందుకోవడం కష్టంగానే ఉంది.