అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.