Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Tata Altroz 2025 Facelift Set To Launch On May 22 Full Variant And Feature Breakdown Revealed

Tata Altroz 2025: మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల కాబోతున్న టాటా అల్ట్రోస్‌..!

NTV Telugu Twitter
Published Date :May 20, 2025 , 8:42 pm
By Kothuru Ram Kumar
Tata Altroz 2025: మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల కాబోతున్న టాటా అల్ట్రోస్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tata Altroz 2025: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన ప్రతిష్టాత్మక మోడల్ అయిన టాటా అల్ట్రోస్‌ను 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయబోతుంది. మే 22న మార్కెట్లోకి రానున్న ఈ కొత్త వెర్షన్‌కి 2020లో వచ్చిన తర్వాత ఇదే మొదటి పెద్ద అప్డేట్. కొత్త డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్‌లో కీలక మార్పులు చేపట్టారు. టాటా మోటార్స్ డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. టాటా అల్ట్రోస్‌ మోడల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజిన్ వేరియంట్లే కొనసాగనున్నాయి. ఇందులో 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అదే బేస్‌పై టర్బోచార్జ్డ్ వెర్షన్, 1.2 లీటర్ CNG ఆప్షన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లను అందించనున్నారు. ఈ డీజిల్ వేరియంట్ భారతీయ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఏకైకంగా ఉండటం విశేషం. మంచి మైలేజ్ కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్.

Read Also: OnePlus: రెండు కొత్త ఫోన్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ ను లాంచ్ కు సిద్దమైన వన్‌ప్లస్..!

టాటా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్డ్ S, అకాంప్లిష్డ్+ S ఐదు ట్రిమ్‌లలో విడుదల చేయనుంది. ప్రతి వేరియంట్ భిన్నమైన కస్టమర్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, కంఫర్ట్ పరంగా రూపొందించబడింది. బేస్ మోడల్ అయిన ‘స్మార్ట్’ వేరియంట్ అవసరమైన సేఫ్టీ, డిజైన్ అంశాలపై దృష్టి సారిస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ లాంప్స్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్ మోడల్ మీద ఆధారపడి ప్యూర్ ట్రిమ్ మరింత అధునాతన ఫీచర్లను జోడిస్తుంది. ఇందులో 7-ఇంచ్ హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫొటైన్‌మెంట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, మెరుగైన LED హెడ్‌ల్యాంప్స్, రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డ్ ORVMలు, వాయిస్ అసిస్టెంట్ తో సన్‌రూఫ్ వంటి ఎంచుకునే ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రియేటివ్ వేరియంట్ లో టెక్నాలజీ, స్టైలింగ్ పరంగా వినియోగదారులకు ప్రీమియం అనుభవం అందిస్తుంది. ఇందులో 360 డిగ్రీ HD కెమెరా, 10.25-ఇంచ్ ఇన్ఫొటైన్‌మెంట్ స్క్రీన్, లూమినేట్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, పుష్ బటన్ స్టార్ట్, గెలాక్సీ అంబియంట్ లైటింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Read Also: MLC Kavitha: ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.. నోటీసులపై స్పందించిన కవిత..!

ఇక అకాంప్లిష్డ్ S వేరియంట్ లో మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇందులో డ్రాగ్ కట్ R16 అలాయ్ వీల్స్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED ఫాగ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మొబైల్ చార్జర్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఎంపిక ఉన్నాయి. ఇక అకాంప్లిష్డ్+ S వేరియంట్ అన్నిటికన్నా టాప్ వేరియంట్. ఈ అకాంప్లిష్డ్+ S లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అధునాతన డిస్‌ప్లేలు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, నావిగేషన్‌తో కూడిన 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ స్పాట్ మానిటర్, AudioWorX కస్టమైజేబుల్ ఆడియో మోడ్‌లు, ఎయిర్ ప్యూరిఫైర్, SOS కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మే 22న లాంచ్ అయ్యే ఈ కార్ ధరలు, ట్రిమ్ ఆధారిత ఫీచర్లు అధికారికంగా త్వరలో వెల్లడికానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 Altroz Features
  • Altroz Variants
  • Car Launch India
  • Premium Hatchback
  • Tata Altroz 2025

తాజావార్తలు

  • Astrology: జూన్‌ 13, శుక్రవారం దినఫలాలు

  • Air India Plane Crash: ఎయిరిండియా విమాన దర్యాప్తు కోసం భారత్ రానున్న బ్రిటిష్ ఏజెన్సీ..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించిన అమిత్ షా

  • Kubera: కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్

  • CM Revanth Reddy: జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల కేటాయింపు..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions