OnePlus: రెండు కొత్త ఫోన్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ను లాంచ్ కు సిద్దమైన వన్‌ప్లస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus: వన్‌ప్లస్ తన తాజా ఎస్ 5 సిరీస్‌లోని రెండు కొత్త ఫోన్‌లతో పాటు కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను మే 27న చైనా మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్, ఏస్ 5 అల్ట్రా ఎడిషన్ ఫోన్‌లతోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా లాంచ్ కానున్నాయి.
Read Also: MLC Kavitha: ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.. నోటీసులపై స్పందించిన కవిత..!
Also Read
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్:
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్ ఫోన్ గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఫోన్‌లో మిడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఫెంగ్చి గేమింగ్ కోర్, లింగ్జీ టచ్ చిప్, గేమింగ్ వై-ఫై చిప్ G1 వంటి అత్యాధునిక గేమింగ్ హార్డ్‌వేర్‌ను వన్‌ప్లస్ ప్రవేశపెడుతోంది. దీంతో ఫ్రేమ్ డ్రాప్, టచ్ డిస్కనెక్ట్, వై-ఫై డిస్కనెక్ట్ లాంటి ఇబ్బందులు కలగకుండా మంచి గేమింగ్ అనుభవం లభించనుంది. ఇది వినియోగదారులకు స్మూత్ గేమింగ్ అనుభూతిని అందించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్, బ్రీజ్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వన్‌ప్లస్ ఈ మోడల్‌ను పలు వేరియంట్లలో అందించనుంది. వీటిలో 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి.
Read Also: IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..!
వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్:
వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ ఫోన్‌ను మిడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇది 6.77 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 120Hz LTPS డిస్‌ప్లేతో రానుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలతో కూడిన డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌ను రాక్ బ్లాక్, వైట్, విల్డర్నెస్ గ్రీన్ రంగుల్లో విడుదల చేయనున్నారు. స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB లలో ఇది అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది. దీని వల్ల ఫోన్ తేలికగా ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ బడ్స్ 4:
వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా అదే ఈవెంట్‌లో లాంచ్ కానున్నాయి. కంపెనీ ప్రకారం వీటిలో ఫ్లాగ్‌షిప్ లెవెల్ శబ్ద నాణ్యత, డిజైన్, నాయిస్ రిడక్షన్ ఫీచర్లు ఉంటాయి. ఇంకా ఫ్రాస్టెడ్ మెటల్ లుక్, డ్యూయల్ DAC (OnePlus Buds Pro 3లో ఉపయోగించినదే) ఉండనున్నాయి. స్పేస్ గ్రే, పైన్ షాడో గ్రీన్ రంగులలో లభిస్తుంది. ఈ మూడు ఉత్పత్తుల పూర్తి వివరాలు మే 27న అధికారికంగా వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!