Mountain of cash: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు లక్షల మంది ఉద్యోగుల జాబ్‌లు ఊడిపోయాయి. ఇంకా ఎంతమంది రోడ్డున పడతారో కాలమే చెప్పాలి. ఇది ఇలా ఉంటే చైనాకు చెందిన ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్‌ను ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. బోనస్ కింద 30 మందికిపైగా ఉద్యోగులకు దాదాపు రూ.73 కోట్లు అందజేసింది. అంతేకాదు, ఆ మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఆ డబ్బును కట్టకట్టలుగా వేదికపై పేర్చి పంచిపెట్టింది. దీంతో ఆ నగదును తీసుకెళ్లడానికి ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకుని నింపుకెళ్లడం గమనార్హం.
Read Also: TSRTC: మీట నొక్కగానే.. సమస్త సమాచారం.. కొత్త సాంకేతికతతో నెట్ వర్క్ అప్ గ్రేడ్
కరోనా కారణంగా పలు సంస్థలు గతేడాది తీవ్ర నష్టాలను చవిచూసిచూశాయి. చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే క్రేన్ల తయారీ సంస్థ మాత్రం భారీ లాభాలను ఆర్జించింది. దీంతో సంస్థ లాభార్జనకు కారణమైన తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. కంపెనీ సేల్స్ విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 30 మందికిపైగా ఉద్యోగులకు రూ.73 కోట్లు బోనస్‌గా ప్రకటించింది. జనవరి 17న ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ మొత్తాన్ని పంచిపెట్టింది. రూ. 73 కోట్ల మొత్తాన్ని నోట్ల కట్టల రూపంలో వేదికపై పేర్చి.. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు మొదటిగా ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్ యువాన్లు (రూ. 6 కోట్లు) చొప్పున అందించింది. సంస్థ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Read Also:Last Selfie : చస్తున్నానని భర్తకు సెల్ఫీ తీసుకుని పంపింది… స్పందించకపోవడంతో నిజం చేసింది