కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత రెండేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూనే ఉన్నారు మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పా రంజిత్, లోకేశ్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంత మంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే.. ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, పా రంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : Ravi Teja : రవితేజ బర్త్ డే స్పెషల్.. ఇరుముడితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా?
కూలీపై అంచనాలు పెంచిన లోకేశ్ కనగరాజ్.. ఆ ఎక్స్ పర్టేషన్స్ రీచ్ కావడంలో తడబడ్డాడు. మల్టీస్టారర్స్‌ను చేతిలో పెట్టుకుని సరైన రిజల్ట్ అందించలేకపోయాడు లోకీ. రజనీ, అతడి ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవాతో మూవీ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. తనేంటో ఫ్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి.. ఆరు నెలలు తిరిగే సరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని సెట్ చేసుకుని.. ఎనౌన్స్‌మెంట్ చేసేశాడు. విడుదలై2తో ఫ్లాప్ చూసిన వెట్రిమారన్.. సూర్యతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే.. కాస్త గ్యాప్ తీసుకుని శింబుని లైన్లో పెట్టాడు. అరసన్ మూవీని స్టార్ చేశాడు వెట్రి. గ్యాంగ్ స్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్‌తో తంగలాన్ తీసి చేతులు కాల్చుకున్న పా రంజిత్ కూడా నెక్ట్స్ వెట్టువం అనే ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత సార్పట్ట సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పా రంజిత్. సో ఈ ముగ్గురుకి ఓ విజన్, ఓ పద్దతి, ప్లాన్ ఫిక్సైయ్యింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ నెక్ట్స్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్. బెస్ట్ ఫ్రెండ్ లోకీని చూసైనా కూడా కంగారు పడటం లేదు ఈ డైరెక్టర్.