తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు వస్తుంటాయి.. గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది..
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెగకేక్కిస్తున్నారు.. అజిత్ కు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే భారీ పారితోషికం అందుకుంటున్న కోలీవుడ్ హీరోల లిస్ట్ లో ఉన్న అజిత్ కూడా ఒకరు.. ఇప్పుడు ఈ సినిమాతో రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు..
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. అయితే ఈ సినిమా కోసం అజిత్ ఏకంగా 165 కోట్ల వరకు తీసుకున్నారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నారు.. ఇకముందు చేసే సినిమాలకు కూడా రెమ్యూనేషన్ ఎక్కువగానే తీసుకుంటున్నట్లు సమాచారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా అజిత్ రెమ్యూనరేషన్ పెంచి అందరికి షాక్ ఇస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరోలలో అందరికన్నా ఎక్కువగా రజినీకాంత్ తీసుకుంటున్నారు.. ఇప్పుడు అజిత్ కూడా రెమ్యూనరేషన్ ను పెంచేశారు…