NTV Telugu Site icon

Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా

Tamanna

Tamanna

Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమెను మిల్కీ బ్యూటీ అంటారు. ఆమె అందాన్ని చూసి మైమరచిపోని అభిమానులు ఉండరు. అంత అందమైన నటి తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది.

Read Also: Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను

తమన్నా తాను అందంగా ఉండేందుకు ప్రతీరోజు గంధం, కాఫీ పొడి, తేనె కలిపి ముఖానికి రాసుకుంటానని తెలిపింది. అలాగే పెరుగు, రోజ్ వాటర్ టిప్స్ కూడా వాడితే ముఖం మెరిసిపోతుందని చెప్పారు. దీంతో పాటు తన తల్లి చెప్పిన సూచనలు పాటిస్తుంటాన్నన్నారు. ఈ బ్యూటీ టిప్స్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తన ప్రేమ గురించి చెప్పకుండా బ్యూటీ టిప్స్ ఇస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా పేజీల్లో వివిధ బట్టలు ధరించి ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటారు.

Read Also: Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ

ప్రేమ వివాదం
తమన్నా హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం విడుదల చేయకపోగా, ఇప్పుడు తన అభిమానుల కోసం అందాల చిట్కా వీడియోను విడుదల చేశారు. వస్త్రధారణ విషయంలోనూ పలుసార్లు వివాదంలో చిక్కుకున్నారు.. కానీ తమన్నా వాటిపై స్పందించలేదు. ఇన్ని సమస్యలను సులువుగా ఎదుర్కొంటూనే నేటి వరకు సినీ పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్నారు.

Show comments