రవీంద్రభారతిలో తెలంగాణ విద్యా దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్య వ్యవస్థలో గొప్ప మార్పులకు నాంది పలికారు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మన ఊరు మన బడితో ..పాఠశాల భవనాలు, లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల మేస్ చార్జీ లకోసం ఉద్యమాలు జరిగేవని, తెలంగాణలో విద్యార్థులకు సన్నబియ్యం.. పోషకాహారం అందిస్తుంది సర్కార్ అని ఆయన తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువే కాదు… స్పోర్ట్స్, సంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని, ఉన్నత ప్రమాణాలతో గురుకుల పాఠశాల ను ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ తండ్రి లా .. రాష్ట్రంలో సంపూర్ణ సమ్మున్నత ప్రమాణాలతో విద్య రంగాన్ని తీర్చిదిద్దారన్నారు. దేశానికే తెలంగాణ విద్య వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తుందని అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Farming: సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు
అనంతరం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విజన్ ఉన్నా నాయకుడు ముఖ్యమంంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ దూరదృష్టితో తోనే.. విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయని, మన ఊరు మనబడి అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం విద్యా శాఖకు ఇంత నిధులు కేటాయించలేదు.. మన ఊరు మన బడికి దశాదిశా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలు తొంబై కళాశాలకు న్యాక్ అక్రిడేషన్ గుర్తింపు పొందడం ఒక రికార్డు అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పాఠశాలల ప్రారంభం రోజే టెక్స్ట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగిందని, 190 కోట్ల రూపాయలతో టెక్స్ట్ బుక్స్ అందజేశామన్నారు. అంతేకాకుండా.. ‘ప్రభుత్వ పాఠశాల లో చదివే పేద విద్యార్థులు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేస్తున్నాము.
Also Read : Off The Record: బీఆర్ఎస్‌కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?
వారంలో మూడు రోజులపాటు విద్యార్థులకు రాగిజావ అందజేస్తుం.. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాధించారు మరింత మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని కోరుతున్నాను. ఉపాధ్యాయులు ఛాలెంజ్ గా తీసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. దేశంలో ఎక్కడి లేనివిధంగా అద్భుతమైన గురుకుల పాఠశాలలో మన రాష్ట్రంలో ఉన్నాయి. గురుకుల పాఠశాలలో ఇంటర్ డిగ్రీ గా అప్‌గ్రేడ్ చేసింది మన ప్రభుత్వం.. ప్రభుత్వం 23 వేల కోట్ల రూపాయలు విద్యారంగంపై ఖర్చు చేస్తుంది ఇది ఖర్చు కాదు.. మానవ వనరుల అభివృద్ధి’ అని ఆయన అన్నారు.