అభివృద్ధి, ప్రజా సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ ఆయన అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా.. అంబర్ పేటలో 20 సంవత్సరాలలో జరగని అభివృద్ధి గడిచిన 4 సంవత్సరాలలో జరిగిందన్నారు.
Also Read : Tarun Chugh : కేసీఆర్ తెలంగాణ నయా నిజాం
కులాలు, మతాలతో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉండి అంబర్ పేట, కేంద్రమంత్రిగా 4 సంవత్సరాలలో సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి చేసింది ఏమి లేదని ఆయన అన్నారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అని ఆయన మంత్రి తలసాని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరు లేరని, యాదగిరిగుట్ట వంటి గొప్ప ఆలయ నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, గొప్పగా పండుగలు నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు. కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్, తాగునీటి సమస్యను పరిష్కరించారని వెల్లడించారు. ప్రజలు కూడా ఆలోచించాలని పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని అన్నారు.
Also Read : Ram Charan: చరణ్ కీలక నిర్ణయం.. నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు బ్రో..?