Sugar Intake: ప్రతి సంతోషకరమైన సందర్భంలో చాక్లెట్లు, స్వీట్లు చూపించడం మాకు అలవాటు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకుంటే మధుమేహం బారిన పడతారన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కట్టడి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర మిఠాయిలు ఇవ్వవద్దని సూచించారు.
Read also: Pushpa2TheRule : బ్యాగ్రౌండ్ కోసం తమన్, అజనీష్ కాకుండా మరొకరు..?
తాజా పరిశోధనల ప్రకారం, శిశువులలో మొదటి రెండు సంవత్సరాలలో చక్కెర వినియోగాన్ని నియంత్రించడం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా దోహదపడుతుంది. చిన్న వయస్సులో చక్కెర వినియోగం పరిమితిలో ఉంచుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 35 శాతం తగ్గించవచ్చు. రక్తపోటు ప్రమాదం నుండి 20 శాతం నివారించవచ్చు. భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్న దృష్ట్యా, చక్కెర వినియోగాన్ని తగ్గించాలనే ఈ సిఫార్సు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో సహాయపడుతుంది. అధిక చక్కెర వినియోగం ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Read also: CM Chandrababu: నేడు సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలంకు సీఎం చంద్రబాబు
ఇది పిల్లల ప్రవర్తన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని తగ్గించడం వల్ల పిల్లల్లో ఆహార నియంత్రణ, శరీర బరువుతో పాటు దంతాల ఆరోగ్యం, శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. చక్కెర పానీయాలు, చిరుతిళ్లను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. రెండేళ్లలోపు పిల్లలు షుగర్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద పిల్లలు కూడా పరిమిత మోతాదులో తినాలని సిఫార్సు చేస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని సిఫార్సు చేసింది. పండ్లు, పండ్ల రసాలు..ఇంట్లో తయారుచేసిన తక్కువ చక్కెర ఆహారాలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని నిపుణులు కోరుతున్నారు.
VarunTej : మట్కా కోసం 4 రకాల డబ్బింగ్.. వరుణ్ తేజ్ కష్టం ఫలించేనా..?