Sugar Intake: ప్రతి సంతోషకరమైన సందర్భంలో చాక్లెట్లు, స్వీట్లు చూపించడం మాకు అలవాటు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకుంటే మధుమేహం బారిన పడతారన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కట్టడి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర మిఠాయిలు ఇవ్వవద్దని…