Suresh Babu : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్” 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు తన జీవితంలోని విశేషాలను పంచుకుంటూ, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
బాలకృష్ణ అడిగిన “అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాతగా ఎందుకు మారారు?” అనే ప్రశ్నకు సురేష్ బాబు స్పందిస్తూ, తనకు సినిమారంగం పట్ల మొదట ఆసక్తే లేదని చెప్పారు. చిన్నప్పుడు తన తండ్రి రామానాయుడు సినిమాల రంగం కష్టమైందని, బాగా చదువుకోవాలని సూచించారని గుర్తు చేసుకున్నారు.
Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?
తరువాత చెన్నైలో ఉన్న సమయంలో కొంతమంది దర్శకులు తనను హీరోగా చూడాలని కోరినా, ఆ ఆలోచన తనకు నచ్చలేదని వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో గురించి మాట్లాడుతూ, “ఎస్‌పీ లోగోలో ‘ఎస్’పై వెంకటేశ్‌ను నిలబెట్టి స్టార్ అవుతారని, ‘పీ’పై తనను నిలబెట్టి ప్రొడ్యూసర్ అవుతారని మా నాన్న గారే చెప్పారు” అని వివరించారు.
తన తండ్రి బ్యానర్ కోసం వచ్చే కథలు మొదట తానే నిర్మాతగా వినేవాడినని, ఆ కథ సినిమాగా ప్రేక్షకులకు చేరగలదా? నిర్మాతకు లాభం వస్తుందా? అనే కోణంలో విచారించేవాడినని చెప్పారు. కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరించేవాడినని కూడా స్పష్టం చేశారు. ఇలా సురేష్ బాబు, తండ్రి రామానాయుడు మార్గదర్శకత్వం, పరిశ్రమలోని తన అనుభవాల గురించి చెబుతూ, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Manmohan Singh Last Rites: ముగిసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు