Supreme Court: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జస్టిస్‌లు ఎస్‌కే కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఏ ప్రాథమిక హక్కును దెబ్బతీస్తోందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు పని కాదు కదా.. ఎందుకు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. “ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది? మీరు కోర్టుకు వచ్చినందున మేము చట్టాన్ని గాలికి విసిరాలా?”.. అని ధర్మాసనం పేర్కొంది.
Uttar pradesh : యూపీలో అమానుషం.. 36ఏళ్లుగా కూతురుని గదిలో బంధించిన తండ్రి
గోసంరక్షణ చాలా ముఖ్యమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. ఇది కోర్టు పని కాదని న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) గోవంశ్ సేవా సదన్, ఇతరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది.