Uttar pradesh : యూపీలో అమానుషం.. 36ఏళ్లుగా కూతురుని గదిలో బంధించిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar pradesh : ఉత్తరప్రదేశ్‌లో అమానుషం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేదని కన్న కూతురుని గొలుసులతో 36ఏళ్లుగా గదిలోనే బంధించాడో తండ్రి. ఇన్నాళ్లూ ఆ మహిళకు కుటుంబసభ్యులు గది తలుపు కింద నుంచే భోజనాన్ని అందించేవారు. ఆ గదిలోనే మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయించేవారు. ఇటీవల ఆమె తండ్రి మరణించడంతో ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. దీంతో ఓ ఎన్జీవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను విడిపించారు. ఇప్పుడు ఆ మహిళకు 53సంవత్సరాలు. ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. ఆ కారణంతో సప్నా తండ్రి 36 ఏళ్ల కిందట ఆమెను గదిలోకి తీసుకెళ్లి.. గొలుసులతో కట్టేసి.. బంధించాడు. అప్పటికీ సప్నా వయస్సు 17 ఏళ్లు.
Read Also: Nirmala Sitaraman: కూరగాయల మార్కెట్లో కేంద్ర మంత్రి.. జీఎస్టీ వేస్తారేమోనంటూ కామెంట్లు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
స్థానిక ఎన్జీవో సేవా భారతి సభ్యులు మహౌర్‌కు కేసు గురించి హత్రాస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు సమాచారం అందించారు. అనంతరం ఎట్టకేలకు ఆమెకు విముక్తి కల్పించారు. ఆమె తండ్రి మరణించిన తరువాత, ఎన్జీవో తరఫున కొంతమంది మహిళలు ఆమె ఇంటికి వెళ్ళారు. బాధితురాలిని చూసినప్పుడు చాలా ఘోరమైన స్థితిలో ఉందని సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలాసింగ్ చెప్పారు.
Read Also:MBBS in Hindi: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం
ఎమ్మెల్యే మహౌర్ మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని వారిని ఒప్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించారు. కొన్ని వారాల్లో ఆమె కోలుకుంటుందని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, మహిళ పరిస్థితి గురించి తమకు తెలుసని, వైద్యులను సంప్రదించమని కుటుంబీకులకు పలుమార్లు చెప్పామని, అయితే తమ కుటుంబ విషయాలకు దూరంగా ఉండాలని ఆమె కుటుంబసభ్యులు అన్నట్లు ఆమె ఇరుగుపొరుగు వాళ్లు తెలిపారు.
- Tags
- Chain
- Daughter
- father
- room
- Uttar Pradesh
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!