Supreme Court: ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్‌పై హైకోర్టు స్టే కొట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాపై తమిళనాడు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ తీవ్ర హెచ్చరిక
Also Read
- Ashwin: "సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. అయితే.. “సిట్” ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు.. సిట్ ఏర్పాటుపై స్టే విధించింది.. ఇక, సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ రోజు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు… ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును, తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఇక, ఏపీ హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
ట్రెండింగ్
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!